ముగిసిన సీఎం జగన్‌ విదేశీ పర్యటన | CM Jagan Arrived From Foreign Tour Grand Welcome From YSRCP | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Published Sat, Jun 1 2024 6:51 AM | Last Updated on Sat, Jun 1 2024 12:33 PM

CM Jagan Arrived From Foreign Tour Grand Welcome From YSRCP

కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో  సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. 

ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్‌ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. 

👉ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్‌ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్‌ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement