277 ఫోన్లు: వారి ముఖాల్లో చిరునవ్వులు

Chittoor Police Traced Returned 277 Mobile Phones To The Phone Owners - Sakshi

సాక్షి, చిత్తూరు : పోగొట్టుకున్న, దొంగిలించబడ్డ మొబైల్‌ ఫోన్లను కనుక్కోవటమే కాకుండా తిరిగి వాటిని యజమానులకు అందించి చిత్తూరు పోలీసులు వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. చిత్తూరు పోలీస్‌ టెక్నికల్‌ అనాలిసిస్‌ వింగ్‌ దాదాపు 277 ఫోన్లను ట్రేస్‌ చేసి పట్టుకుంది. దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే ఆ ఫోన్లను సోమవారం యజమానులకు ఇచ్చేసింది.

దీనిపై సెల్‌ఫోన్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు పోలీసుల కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ తమ ట్విటర్‌ ఖాతా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top