అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి

సాక్షి, చిత్తూరు రూరల్: అమెరికాలో జిల్లాకు చెందిన ప్రేమలత (32) మంగళవారం రాత్రి మృతి చెందింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు, అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడుతో 2016లో వివాహమైంది. 2017లో సుధాకర్ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్ ఉన్నాడు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..)
మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమార్తెను సుధాకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడనిమృతురాలి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని పంపించడానికి అల్లుడు నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కలెక్టర్ భరత్‌నారాయణగుప్తాను కోరారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి