
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నుంచి బాలల అదాలత్‌లు నిర్వహించనున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. మంగళగిరి కమిషన్ కార్యాలయంలో సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, గోండు సీతారాం, బత్తుల పద్మావతితో ఆయన సమావేశమయ్యారు.
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు, సన్నాహాలపై వారు చర్చించారు. 18 సంవత్సరాల్లోపు బాలలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఇలాంటి విషయాలు తమ దృష్టికి తీసుకురావడానికి ఈ అదాలత్‌లు సువర్ణావకాశమని వివరించారు.