ప్రభుత్వాసుపత్రుల్లోనే శిశు ఆధార్‌ | Child Aadhaar in government hospitals Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రుల్లోనే శిశు ఆధార్‌

Published Mon, Aug 29 2022 3:53 AM | Last Updated on Mon, Aug 29 2022 2:30 PM

Child Aadhaar in government hospitals Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆస్పత్రులకు ట్యాబ్‌లు, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌లను సమకూర్చారు. ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్‌ రిజిస్ట్రేషన్‌ తరహాలోనే శిశు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకు యూఐడీఏఐ ఓ పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ మొదలవుతుంది. 

తాత్కాలిక ఆధార్‌
యూఐడీఏఐ ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ను జారీ చేస్తుంది. ఇందుకు శిశువుల బయోమెట్రిక్‌ డేటాతో పనిలేదు. పిల్లల ఫొటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌ తదితర వివరాల ఆధారంగా శిశువుకు తాత్కాలిక ఆధార్‌ జారీ చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement