వచ్చే మంగళవారం మళ్లీ బాబు సర్కారు అప్పు | Chandrababu Naidu government is borrowing again next Tuesday | Sakshi
Sakshi News home page

వచ్చే మంగళవారం మళ్లీ బాబు సర్కారు అప్పు

May 31 2025 3:19 AM | Updated on May 31 2025 3:19 AM

Chandrababu Naidu government is borrowing again next Tuesday

ఒకేసారి రూ.7,000 కోట్ల అప్పునకు ఇండెంట్‌ 

3వ తేదీన ఆర్‌బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరణ 

కొత్త ఆర్థిక ఏడాది రెండు నెలల్లోనే రూ.19,572 కోట్ల అప్పు   

సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. జూన్‌ 3న ఒకేసారి రూ.7,000 కోట్ల అప్పునకు ఇండెంట్‌ పెట్టింది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. 

తొమ్మిదేళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 11 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 13 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్ల అప్పు చేయనుంది. దీంతో కొత్త ఆరి్థక ఏడాది రెండు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.19,572 కోట్ల అప్పు చేసినట్లవుతుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement