
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీ వేలంను ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. రూ.1,000 కోట్ల అప్పు వచ్చే ఎనిమిదేళ్లలో తీర్చేలా, మరో రూ.1,000 కోట్ల అప్పు వచ్చే తొమ్మిదేళ్లలో.. రూ.1,500 కోట్ల అప్పు 11 ఏళ్లలో.. మరో రూ.1,500 కోట్ల అప్పు 12 ఏళ్లలో తీర్చేలా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.