విదేశీ కరెన్సీ విషయంలో టీటీడీకి ఊరట.. కేంద్రం కీలక ప్రకటన

Center Govt Key Announcement For TTD Regarding Foreign Currency - Sakshi

సాక్షి, తిరుమల: భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం ఊరటనిచ్చింది. శ్రీవారికి విదేశీ దాతలు లేదా భక్తులు సమర్పించే కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి మినహాయింపును ఇచ్చింది. 

వివరాల ప్రకారం.. భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ విషయంలో టీటీడీకి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది. సెక్షన్‌ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్‌ తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు కేంద్రం సమాచారం ఇచ్చింది. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top