తాడేపల్లిగూడెం నిట్‌ డైరెక్టర్‌ ఇళ్లు సీజ్‌

CBI, ACB Officials Attack on Tadepalligudem NIT Director Houses And Hospitals - Sakshi

తెలంగాణలోని కాజీపేటలో సీబీఐ, ఏసీబీ అధికారుల దాడులు 

సాక్షి, హన్మకొండ(కాజీపేట): ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సూర్యప్రకాష్‌రావు ఇళ్లు, ఆస్పత్రులపై బుధవారం తెల్లవారుజామున సీబీఐ, ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట రహమత్‌నగర్‌ కాలనీ ప్రధాన రహదారిపై ఉండే డైరెక్టర్‌ ఇళ్లపై విశాఖపట్నం, హైదరాబాద్‌ నగరాలకు చెందిన సీబీఐ సీఐ ఎ.సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి సీజ్‌ చేశారు.  

చదవండి: (కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top