‘వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి’

Cabinet Sub Committee Meeting On One Time Settlement Of Housing Scheme - Sakshi

సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. లక్షలాదిమంది పేదల మేలు కోసమే వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం తీసుకువచ్చామని తెలిపారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

డిసెంబర్‌ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. పథకం అమలులో సాదకబాధకాలను కూలంకషంగా పరిశీలించాలని తెలిపారు. 1980-2011 వరకు ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు విడిపించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పేదల ఇళ్లపై వారికే పూర్తి హక్కు వస్తుందని పేర్కొన్నారు. తమ తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు.

ఈ సమావేశంలో సీసీఎల్‌ఏ నీరబ్ కుమార్‌ ప్రసాద్‌, స్పెషల్ సీఎస్(రిజిస్ట్రేషన్స్&ఎక్సైజ్) రజత్ భార్గవ్, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ(హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ(ల్యాండ్,ఎండోమెంట్స్ &డీఎం- రెవెన్యూ) వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పీఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్‌ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top