ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌

British Deputy High Commissioner Gareth Wynn Owen Meet CM Jagan - Sakshi

విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అద్భుతం

సీఎం జగన్‌తో భేటీ అనంతరం బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌

యూకే తరహాలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రశంసలు

ఐటీ, పరిశోధన రంగాలపై బ్రిటీష్‌ బృందం ఆసక్తి
 

 

సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: విద్య, వైద్య రంగాలలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఇతర సభ్యులతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. వారితో వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన అంశాల గురించి ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు.

యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌.. వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. యూకే – భారత్‌ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై విన్‌ ఓవెన్‌ సానుకూలంగా స్పందించారు. 

ఐటీ, పరిశోధన రంగాల్లో కలిసి పని చేస్తాం
ఐటీ, పరిశోధన రంగాలపై బ్రిటిష్‌ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంకు హామీ ఇచ్చింది.  ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటిష్‌ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతి గురించి కూడా వారితో చర్చించారు. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆసక్తిగా తెలుసుకున్న విన్‌ ఓవెన్‌.. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా చర్చించారు. విద్యా రంగానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రిటీష్‌ కమిషన్‌ ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పొలిటికల్‌ ఎకానమీ అడ్వైజర్‌ నళిని రఘురామన్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.  
చదవండి: వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాల ప్రకటన 

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రణాళికపై బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ కాన్సెప్ట్‌కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్‌ బృందానికి సీఎం వివరించారు. ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించే విషయంపై చర్చించారు. ‍బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సానుకూలంగా స్పందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top