‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది’

BJP MP GVL Narasimha Rao On Visakha Steel Plant - Sakshi

విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌. నరసింహారావు. స్టీల్‌‍ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ముడిసరుకు ఇచ్చేందుకు ఎన్‌ఎండీసీ సిద్ధంగా ఉందని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు. అదే సమయంలో విశాఖ నుంచి వారణాసి ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. 

‘విశాఖ నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. చాలా సందర్బాల్లో రైల్వే మంత్రిని కలిసి రైలు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం వచ్చింది. వారానికి రెండు రోజులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో దీన్ని రోజువారి రైలుగా నడిపే అవకాశం ఉంది. విజయదశమి లోపు ప్రారంభించాలని కోరాం’ అని తెలిపారు.

చదవండి:  ‘జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top