బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి | Balakrishna should apology says AP Nursing Welfare Association | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Feb 5 2023 5:39 AM | Updated on Feb 5 2023 12:55 PM

Balakrishna should apology says AP Nursing Welfare Association - Sakshi

గుంటూరు మెడికల్‌: ఓ టీవీ ఛానల్‌ ప్రోగ్రాంలో  సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని నర్సులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  

అన్‌స్టాపబుల్‌ అనే కార్యక్రమంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. బాలకృష్ణ గతంలోనూ తనకు  వైద్య సేవలు అందించిన ఒక నర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.   నర్సులపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement