బాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి | Bahujan Parirakshana Samiti Leaders Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

Mar 9 2021 5:14 AM | Updated on Mar 9 2021 5:14 AM

Bahujan Parirakshana Samiti Leaders Comments On Chandrababu - Sakshi

మహిళా నేతలను సత్కరిస్తున్న నాయకులు

తాడికొండ: అమరావతిని కాపాడుకోకపోతే వేరే రాష్ట్రాలకు పోయి పాచిపని చేసుకోవాల్సి వస్తుందంటూ పేద, దళిత వర్గాల వృత్తిని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలులో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 160వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు మాట్లాడారు.

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్న చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు రెచ్చిపోయిన పెయిడ్‌ ఆర్టిస్టులంతా రాజధాని నుంచి డ్రామా కంపెనీని వేసుకుని బయలుదేరి మహిళా దినోత్సవం పేరుతో దుర్గమ్మను అడ్డు పెట్టి కుట్రలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు.  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 160 రోజులుగా దీక్షల్లో పాల్గొంటున్న పలువురు మహిళా సంఘాల నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement