యూరియాకు కృత్రిమ డిమాండ్‌ | Artificial demand for urea | Sakshi
Sakshi News home page

యూరియాకు కృత్రిమ డిమాండ్‌

Jul 18 2025 4:31 AM | Updated on Jul 18 2025 4:31 AM

Artificial demand for urea

చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో వ్యాపారుల అరాచకం

యూరియాకోసం కాంప్లెక్స్‌ను కొనాల్సిందేనని మెలిక

తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో లేకలేక వర్షాలు పడ్డాయి. రైతులు సేద్యపు పను­ల్లో బిజీగా మారారు. పంటలకు, పశుగ్రాసానికి యూరియా అవసరం ఎక్కువైంది. ఇదే అదునుగా పలమనేరు వ్యవ­సాయశాఖ డివి­జన్‌లోని ఎరువుల వ్యాపారులు యూరియాకు కృత్రిమ డిమాండ్‌ను సృ­ష్టించారు.  యూరియా బస్తా కావాలంటే.. కాంపె­్లక్స్‌ ఎరువు బస్తా  కొనా­ల్సిందేనని నిబంధన పె­డుతున్నారు. దీంతో రైతు­లు  విధిలేక యూరియా కోసం కాంప్లెక్స్‌ను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. 

రూ.1,300 నుంచి రూ.1,700 దాకా పెట్టికొన్న కాంప్లెక్స్‌ బ­స్తాలు దుకాణాల్లో అమ్ముడు కాకుండా వ్యా­పారు­ల­కు భారంగా మారుతుండడం దీని­కి కార­ణం.  ప్ర­ధాన డీలర్ల నుంచి స్థానిక వ్యాపారు­ల­కు కూడా ‘యూరియా కావాలంటే కాంప్లెక్స్‌ కొనా­ల్సిందేనన్న’ డిమాండ్‌ వస్తున్నట్లు సమాచారం. 

రూ.250 యూరియా.. రూ.295కు విక్రయాలు
ఎమ్మార్పీ ప్రకారం యూరియా బస్తా ధర రూ.250­గా ఉంది. కానీ ఇక్కడి దుకాణాల్లో వీటిని రూ.295 దాకా విక్రయిస్తున్నారు. ఎందుకని రైతులు ప్రశ్నిస్తే తమకు రేణిగుంటనుంచి యూ­రియా వస్తుందని అక్కడినుంచి ఇక్కడికి రవాణా, అన్‌లోడింగ్‌ చార్జీ­లు తప్పవని చెబుతున్నారు. 

కృత్రిమ డిమాండ్, అధిక ధరల విషయంలో విజిలెన్స్‌ అధికారుల హెచ్చరికలనూ వ్యాపా­రులు బేఖాతరు చేయడం గమనార్హం. ఒకవైపు కృత్రిమ డిమాండ్, మరోవైపు అధిక ధరల నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు కొందరు కర్ణాట­కలోని నంగళి, ముళబాగిళు, బేతమంగళలకు వెళ్లి యూరియాను కొనుగోలు చేస్తున్నారు.

నిజమే కానీ...
యూరియా కావాలంటే.. కాంప్లెక్స్‌ కొనా­ల్సిందేనన్న షరతు వార్తలు నిజమే.  ధరల విషయానికొస్తే రేణిగుంట నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలను ప్రధాన డీలర్లకు ప్రభుత్వం ఇస్తే..  ఆ ప్రయోజనాన్ని రిటైల్‌ వ్యాపారులకు అందించాల్సి ఉంటుంది. ఈ డబ్బు రానందున కొంత ఇబ్బందిగా మారింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎమ్మార్పీకే యూరి­యా­ను విక్రయించాలి. ఆయా అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడతాం. – సాక్షితో స్థానిక వ్యవసాయశాఖ ఏడీ గీతాకుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement