వచ్చే నెలలో చెన్నైకి బస్‌ సర్వీసులు

APSRTC Bus services to Chennai next month - Sakshi

హైదరాబాద్‌కు బస్‌ సర్వీసులు తిప్పడంపైనా త్వరలో నిర్ణయం 

అన్ని జిల్లాల్లో పెరిగిన బస్‌ సర్వీసులు 

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పడంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు కర్ణాటకకు మాత్రమే బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ నడుపుతోంది. వచ్చే నెల చెన్నైకి సర్వీసుల్ని ప్రారంభించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. అత్యంత ఆదరణ కలిగిన రూట్‌ హైదరాబాద్‌కు సర్వీసులు తిప్పడంపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. ఈ నెల 21 తర్వాత టీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు చర్చలు జరపనున్నారు. లాక్‌డౌన్‌ విధించిన జిల్లాల్లో ఆర్టీసీ మొన్నటివరకు సర్వీసులు నడపలేదు. ఇప్పుడు బస్సు సర్వీసుల సంఖ్య జిల్లాల్లో పెరిగింది. 

► ఈ నెల ప్రారంభానికి 2,018 బస్సు సర్వీసులను నడుపుతుండగా శుక్రవారం నాటికి ఈ సంఖ్య 2,363కు చేరింది.  
► వీటిలో అత్యధికంగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వెయ్యి వరకు నడుపుతున్నారు. 
► శ్రావణ మాసం కావడంతో బస్సు సర్వీసులు పెంచారు. పల్లెవెలుగు సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా 684 నడుస్తున్నాయి.  
► గుంటూరు జిల్లాలో శుక్రవారం ఆయా డిపోల పరిధిలో 121 సర్వీసులు తిప్పారు.  
► ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బస్సు సర్వీసులు పెరిగాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top