
సాక్షి, విశాఖపట్నం: గత రెండు రోజులుగా జీ-20 సదస్సులో భవిష్యత్ లో నగరాల అభివృద్ది, పెట్టుబడులనే అంశంపై 8 సెషన్స్ జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సోలమన్ ఆరోఖ్య రాజ్ తెలిపారు. ఈ అర్థవంతమైన చర్చల్లో 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. వారు చాలా విలువైన సలహాలు సూచనలు చేశారన్నారు.
ఈ సూచనలను సదస్సులను రెండు నెలల పాటు అధ్యయనం చేసి జూన్‌లో జరిగే మూడో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్‌లో భవిష్యత్ నగరాల నిర్మాణంపై ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తామన్నారు. సింగపూర్, దక్షిణ కొరియా నుంచి వచ్చే నిపుణులచే చివరి రోజు విద్యార్థులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు శిక్షణా తరగతులు వుంటాయన్నారు.
ఇదీ చదవండి: వైజాగ్‌లో జీ20 ప్రతినిధులు మెచ్చినవేంటో తెలుసా?