పులిచింతల: బ్యారెజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు: నారాయణ రెడ్డి | AP Irrigation Chief Narayana Reddy Comments On Technical Issue At Pulichintala Project | Sakshi
Sakshi News home page

పులిచింతల: బ్యారెజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు: నారాయణ రెడ్డి

Aug 5 2021 2:47 PM | Updated on Aug 5 2021 3:07 PM

AP Irrigation Chief Narayana Reddy Comments On Technical Issue At Pulichintala Project - Sakshi

సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు16వ నంబర్‌ గేట్‌ వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తి విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాత్రి 3:30 సమయంలో గేట్లు ఎత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెయిన్ గడ్డర్ విరిగిపోవడంతో.. సపోర్ట్ రోప్ థ్రెడ్‌లు తెగిపోయి గేటు నదిలో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది’’ అని తెలిపారు. 

‘‘పైనుంచి వరద నీటిని కిందికి వదిలెందుకు రాత్రి గేట్లను ఎత్తారు. ఒకే గేటు గుండా నీరు వెళ్తుండడంతో ఒత్తిడిని తగ్గించేందుకు క్రమక్రమంగా మొత్తం గేట్లను ఎత్తడం జరిగింది. ప్రభుత్వం, ఏజన్సీలు బ్యారేజ్ నిర్వహణను పట్టించుకోవట్లేదనేది అవాస్తవం. మిగిలిన గడ్డర్లు, గేట్ల పరిస్థితిని చెక్ చేస్తున్నాం. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుంది’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement