 
													సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో పదిరోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా కర్ఫ్యూ లో మరో రెండుగంటలు సడలింపు ఇస్తున్నట్లు ఇప్పటికే తెలిపింది. తాజా నిర్ణయంతో సడలింపు సమయం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకూ అమలు కానుంది.
ఇదిలా ఉంటే రోజుకు పదహారు గంటల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ ఉన్నవారికే ఏపీలోకి అనుమతి ఇస్తామని.. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు  ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్ఫ్యూ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
చదవండి: ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
