విజయవాడ: రెండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్‌

AP: Disha App Saved A Woman Life In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: దిశ యాప్‌ రెండు నిండు ప్రాణాలను కాపాడింది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడకు చెందిన ఓ మహిళ తను ఆత్మహత్య చేసుకుంటున్నానని దిశ ఎస్ఓఎస్‌కు సమాచారం ఇచ్చింది. ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను మోసం చేయడంతో సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక గత్యంతరం లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలని కోరింది. వెంటనే స్పందించిన దిశ కంట్రోల్‌ రూం సిబ్బంది మహిళ  ఫోన్ నెంబరు ఆధారంగా  ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. 
చదవండి: దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

హుటాహుటిన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ విషం సేవించి అపస్మారక స్థితిలో పడి ఉండగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు. అంతేకాకుండా మహిళతో పాటు అయిదు సంవత్సరాల బాలికను చేరదీసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: నకిలీ చలానాల కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top