తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన | AP CM YS Jagan Will Visit West Godavari District On April 21 | Sakshi
Sakshi News home page

తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Apr 20 2022 4:08 PM | Updated on Apr 20 2022 7:01 PM

AP CM YS Jagan Will Visit West Godavari District On April 21 - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. సీఎం జగన్‌తో పాటు ఈ కార్యక్రమానికి ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా హాజరుకానున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. అక్కడ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను కుమార మంగళం బిర్లాతో కలిసి సందర్శించిన అనంతరం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement