మా సభ్యులెవరూ అలాంటి ప్రస్తావనే తేలేదు: ఏపీ సీఎం జగన్‌ 

AP CM YS Jagan Gives Clarity On Chandrababu Naidu Break Down Drama - Sakshi

సాక్షి, అమరావతి: భగవంతుడి ఆశీర్వాదం, ప్రజలందరి దీవెన ఉన్నంతకాలమే ఎవరైనా అధికా రంలో ఉంటారని, రాజకీయాల్లో ఈ రెండూ అత్యంత ప్రధానమైన వని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ప్రజ లకు మంచి చేసినంత కాలం వారికి దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి దీవెనలు ఉంటాయన్నారు. శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆవేశంగా సభనుంచి బయటకు వెళ్లిపోయాక... ఆ ఘటనపై సీఎం మాట్లాడారు. వ్యవసాయంపై, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతుండగా... సంబంధం లేని టాపిక్‌ను సభలోకి తీసుకొచ్చి చంద్రబాబే సభలో వాతావర ణాన్ని రెచ్చగొట్టారని, దాన్ని ఖండిస్తూ సహజంగానే అధికార పక్షం నుంచి కొంత మంది మాట్లాడారని, కానీ చంద్రబాబు చెబుతున్నటువంటి మాటలేవీ అధికార పక్షం నుంచి ఎవరూ మాట్లాడ లేదని ఆయన తెలియజేశారు. ఈ సంఘటనకు సంబం ధించి ముఖ్యమంత్రి సభలో ఏమన్నారంటే...

ఆయనకు రాజకీయ ఎజెండానే ముఖ్యం
‘‘ఒకవైపు రైతుల అంశాలపై చర్చ జరుగుతోంది. వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతు న్నారు. కనక ఈ సమయంలో ప్రతిపక్షం సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కానీ చంద్రబాబు మాట్లాడిన తీరు, చేసిన డ్రామా అన్నీ మన కళ్లెదుటే కనబడ్డాయి. ఆ సమయంలో నేను సభలో లేను. వర్షాలపై కలెక్టర్లతో సమీక్షించాను. సభకు వచ్చాక జరిగిన పరాణామాలేంటో తెలుసు కున్నాను. నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రజలెలా ఉన్నా పర్వాలేదు.

పొలిటికల్‌ అజెండానే ముఖ్యం. చంద్రబాబు మీద తాము వ్యతిరేకంగా ఉన్నామని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆయన కుప్పం సహా అన్ని చోట్లా ప్రజల వ్యతిరేకత చూశారు. శాసన మండలిలోనూ వారికున్న బలం పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది. వైఎస్సార్‌సీపీకి చెందిన నా సోదరుడు, దళితుడు మండలి చైర్మన్‌గా రాబోతున్నారు. ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లి పోయా రు. ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడంలేదు.’’ 

వాతావరణాన్ని చెడగొట్టింది ఆయనే..
‘‘చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ వాళ్లు అదే పనిగా ‘గొడ్డలి– బాబాయి... తల్లీ– చెల్లి’ అంటూ ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా, మాధవరెడ్డిల హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపై కూడా చర్చించాలని అధికార పార్టీ సభ్యులు అన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టారు కాబట్టే ఈ మాటలన్నారు. ఎక్కడా కుటుంబ సభ్యుల గురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడ లేదు. నిజానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడింది చంద్రబాబే!. మా చిన్నాన్న, మా అమ్మ, మా చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు. అధికార పక్షం నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదు. సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుంది’’. 

గోబెల్స్‌ ప్రచారంలో దిట్టలు
‘‘చంద్రబాబుకు ఉన్నట్టుగా ఈనాడు వంటి పెద్ద సంస్థ నాకు తోడుగా లేదు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక, టీవీ 5 లాంటి ఛానెల్‌ నాకు లేకపోవచ్చు. అబద్ధాన్ని నిజం చేయడానికి అంత మంది నాకు లేరు. గోబెల్స్‌ ప్రచారంతో వీళ్లు ఏ అబద్ధాన్నయినా నిజం చేయడానికి ప్రయత్ని స్తారు. స్క్రోలింగ్స్‌ వేస్తారు. మీడియాలో వీరి సం ఖ్యా బలం ఎక్కువ కాబట్టి ఏమైనా చేస్తారు. కానీ నిజాన్ని మాత్రం దాచలేరు. ప్రజలకు మంచి జరిగి నంత కాలం బాబు ఎన్ని డ్రామాలు చేసినా పట్టిం చుకోరు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంత కాలం ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 ఎంత చంద్రబాబును మోసినా, అంతిమంగా మంచే విజయం సాధిస్తుంది’’. 

మన చేయితో మన కన్ను పొడుచుకుంటామా?
‘‘గొడ్డలి– బాబాయ్‌... తల్లీ– చెల్లి’’ అంటూ కుటుంబాల గురించి ప్రస్తావించింది చంద్రబాబే. మా చిన్నాన్న గురించి మాట్లాడటం న్యాయమా? వివేకానందరెడ్డి నాకు చిన్నాన్న. మా నాన్నకు సొంత తమ్ముడు. చంద్రబాబుకు కాదు. ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైనా ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్‌ మరో చిన్నాన్న కొడుకు. ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు? మన రెండు కళ్లు ఒకదాన్నొకటి పొడుచుకుంటాయా? మన చేతులు ఒకదాన్నొకటి నరుక్కుంటాయా? మన చేత్తో మన కంటినెందుకు పొడుచుకుంటాం? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాం. మా చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా మాతోనే ఉన్నారు. మా చిన్నాన్నను ఓడించడం కోసం టీడీపీ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు.

కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు మాకు ఎక్కువ మంది ఉన్నారు. మా పార్టీ నుంచి చిన్నాన్నను పోటీ పెడితే.. బలవంతంగా మా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు డబ్బులిచ్చి, ప్రలోభాలు పెట్టి, స్పెషల్‌ ఫ్లైట్‌లు పెట్టి, పోలీసులను పెట్టి, కుయుక్తులు పన్ని.. రకరకాలుగా అక్రమాలు చేసి ఓడించారు. అంత దారుణంగా ప్రవర్తించారు. మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే వాళ్లే చేసి ఉండాలి. అటువంటి దాన్ని ట్విస్ట్‌ చేసి, వక్రీకరించి ఏదేదో చేస్తున్నారు. చివరకు మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్‌ చేసి రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అయినా పైనా దేవుడు ఉన్నాడు.. ఆయనే చూస్తాడు’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top