నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం | Androth strengthens India SAGAR vision | Sakshi
Sakshi News home page

నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం

Oct 7 2025 4:49 AM | Updated on Oct 7 2025 4:49 AM

Androth strengthens India SAGAR vision

సాగర్‌ జలాల్లోకి యుద్ధనౌక ‘ఆండ్రోత్‌’

లక్షదీవుల సమూహంలో ప్రముఖ ద్వీపం ‘ఆండ్రోత్‌’ పేరుతో యాంటీసబ్‌మెరైన్‌ నౌక 

జలప్రవేశం చేయించిన తూర్పు నౌకాదళాధిపతి 

ఆత్మనిర్భర్‌ భారత్‌లో ‘నేవీ నంబర్‌ వన్‌’ అని వెల్లడి 

సముద్ర భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామన్న ఈఎన్‌సీ చీఫ్‌

భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రెండో యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌క్రాఫ్ట్‌ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ను విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో తూర్పు నౌకా దళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెందార్కర్‌ సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ల నిర్మాణంతో ఆత్మనిర్భర్‌ భారత్‌లో భారత నౌకాదళం నంబర్‌ వన్‌గా దూసుకుపోతోందని చెప్పారు.

80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కోల్‌కతాలో ఈ యుద్ధనౌకను తీర్చిదిద్దారని తెలిపారు. వరుసగా భారత్‌లో తయారు చేసిన యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం సరికొత్త చరిత్రగా అభివరి్ణంచారు. ఆండ్రోత్‌ రాకతో సముద్ర రక్షణ మరింత బలోపేతమైందని తెలిపారు. లక్షదీవుల సమూహంలో ఉత్తరాన ఉన్న ప్రముఖ ద్వీపం ‘ఆండ్రోత్‌’ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టినట్టు వివరించారు.– సాక్షి, విశాఖపట్నం

శత్రుదేశాల సబ్‌మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పట్టేస్తుంది 
సముద్ర నిఘా, శోధన, రెస్క్యూ, తీరప్రాంత రక్షణ కార్యక్రమాల్లో ఆండ్రోత్‌ చురుగ్గా వ్యవహరిస్తుందని పెందార్కర్‌ చెప్పారు. శత్రుదేశాల సబ్‌మెరైన్‌లు ఎక్కడ దాక్కున్నా పసిగట్టేలా అధునాతన సెన్సార్లు, అత్యా«ధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో ఈ వార్‌íÙప్‌ నిరి్మంచినట్టు తెలిపారు. తూర్పు తీర సముద్ర రక్షణ విషయంలో తూర్పు నౌకాదళం రాజీలేని పోరాటం చేస్తోందని పునరుద్ఘాటించారు.

ఆండ్రోత్‌ భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరిన తర్వాత.. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లో నావికాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసినట్టేనని తెలిపారు. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని శత్రుదేశాల సబ్‌మెరైన్లని ఆండ్రోత్‌ వేటాడుతుందనీ.. తీరప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘావేసే సామర్థ్యంతో పాటు విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాముల్ని వేటాడే సత్తా ఆండ్రోత్‌ సొంతమని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు, జీఆర్‌ఎస్‌ఈ అధికారులు పాల్గొన్నారు.

‘ఆండ్రోత్‌’ విశేషాలు ఇవీ..
పొడవు: 77.6 మీటర్లు 
వెడల్పు: 10.5 మీటర్లు 
డ్రాఫ్ట్‌:  2.7 మీటర్లు 
బరువు: 1,500 టన్నులు 
వేగం:   గంటకు 25 నాటికల్‌ మైళ్లు
సామర్థ్యం: ఏకధాటిగా 100 నాటికల్‌ మైళ్లు
ఎక్కడ తయారు చేశారు: కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)

వ్యయం:  రూ.789 కోట్లు 
పనులు ప్రారంభం:  2023 మార్చిలో 
సిబ్బంది:  ఏడుగురు అధికారులు, 50 మంది సెయిలర్స్‌ (మొత్తం 57 మంది) 
లక్ష్యం:  సముద్రం లోపల దాగివున్న శత్రు జలాంత ర్గాముల్ని గుర్తించడం, వాటిని   ట్రాక్‌ చేసి నాశనం చేయడం 

అదనపు విధులు:  సముద్ర నిఘా, పరిశోధన, విపత్తు, యుద్ధ సహాయక చర్యలు, తీరప్రాంత పరిరక్షణ 
సెన్సార్‌ వ్యవస్థ: డీఆర్‌డీవో కాంబాట్‌ సూట్, డీఆర్‌డీవో హల్‌ మౌంటెడ్‌ సోనార్, తక్కువ లోతులో సబ్‌మెరైన్‌లను గుర్తించే ఎల్‌ఎఫ్‌వీడీ సోనార్‌ 
ఆయుధ సంపత్తి:  దేశీయంగా తయారు చేసిన 30 ఎంఎం సర్ఫేస్‌ గన్, 6,000 యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్‌ ఒకటి, 2 ట్రిపుల్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడో లాంచర్లు, యాంటీ సబ్‌మెరైన్‌ మైన్స్, 2 ఓఎఫ్‌టీ రిమోట్‌ కంట్రోల్‌ గన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement