హైస్కూళ్లు 9 నుంచి 4 గంటల వరకే | Andhra Pradesh High Schools From 9AM To 4PM Says Department of School Education | Sakshi
Sakshi News home page

హైస్కూళ్లు 9 నుంచి 4 గంటల వరకే

Aug 22 2021 2:53 AM | Updated on Aug 22 2021 2:55 AM

Andhra Pradesh High Schools From 9AM To 4PM Says Department of School Education - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులకు సెల్ఫ్‌ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్‌ ఉంటాయి.

వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లు, ఎస్‌ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాలి. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్‌ మాత్రమే. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూల్‌ సమయాల్లో హాజరు మినహాయింపు ఉంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement