సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.
జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల వివరాలు
| జిల్లా పేరు | ఇన్‌చార్జి మంత్రి | |
| 1 | గుంటూరు | ధర్మాన ప్రసాదరావు |
| 2 | కాకినాడ | సీదిరి అప్పల రాజు |
| 3 | శీకాకుళం | బొత్స సత్యనారాయణ |
| 4 | అనకాపల్లి | రాజన్న దొర |
| 5 | ఏఎస్‌ఆర్‌ఆర్ | గుడివాడ అమర్నాథ్ |
| 6 | విజయనగరం | బూడి ముత్యాల నాయుడు |
| 7 | పశ్చిమ గోదావరి | దాటిశెట్టి రాజా |
| 8 | ఏలూరు | పినిపె విశ్వరూప్ |
| 9 | తూర్పుగోదావరి | చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ |
| 10 | ఎన్టీఆర్ | తానేటి వనిత |
| 11 | పల్నాడు | కారుమూరి వెంకట నాగేశ్వరరావు |
| 12 | బాపట్ల | కొట్టు సత్యనారాయణ |
| 13 | అమలాపురం | జోగి రమేష్ |
| 14 | ఒంగోలు | మేరుగ నాగార్జున |
| 15 | విశాఖపట్నం | విడదల రజిని |
| 16 | నెల్లూరు | అంబటి రాంబాబు |
| 17 | కడప | ఆదిమూలపు సురేష్ |
| 18 | అన్నమయ్య | కాకాణి గోవర్థన్‌రెడ్డి |
| 19 | అనంతపురం | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి |
| 20 | కృష్ణా | ఆర్కే రోజా |
| 21 | తిరుపతి | నారాయణ స్వామి |
| 22 | నంద్యాల | అంజాద్ బాషా |
| 23 | కర్నూలు | బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి |
| 24 | సత్యసాయి | గుమ్మనూరి జయరాం |
| 25 | చిత్తూరు | కేవి ఉషాశ్రీ చరణ్ |
| 26 | పార్వతీపురం | గుడివాడ అమర్నాథ్ |


