అనకాపల్లి బెల్లం మార్కెట్‌ డీలా

Anakapalle Jaggery Market: Bellam Sales Dip Due to Rains, Unseason - Sakshi

ముసురు కారణంగా నిలిచిన లావాదేవీలు 

అన్‌ సీజన్‌ కావడంతో మార్కెట్‌కురాని బెల్లం దిమ్మలు

అనకాపల్లి : అనకాపల్లి మార్కెట్‌కు ముసురు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే అన్‌సీజన్‌లో తీవ్రంగా నష్టపోయిన మార్కెట్‌ వర్గాలు తాజాగా ముసురు కారణంగా లావాదేవీల్లేక మార్కెట్‌ డీలా పడింది. ఈ వారం మూడురోజులుగా ఒక్క బెల్లందిమ్మకూ వ్యాపారం జరగలేదు. మిగిలిన మూడు రోజులు లెక్కిస్తే కేవలం 107 బెల్లం దిమ్మలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శనివారం మార్కెట్‌కు 35 దిమ్మలు రాగా అవి కూడా రెండోరకం కావడంతో ధర కూడా కనిష్టంగా క్వింటాల్‌కు రూ.2,250 పడిపోయింది. ఈనెల 11వతేదీన 39 బెల్లం దిమ్మలు రాగా 14వ తేదీన 33 బెల్లందిమ్మలు వచ్చాయి. 

ఈ వారంలో క్వింటాల్‌ గరిష్టంగా రూ.3,800 పలికింది. ఇక 12న, 13న, 15న మార్కెట్‌కు ఒక్కబెల్లం దిమ్మ కూడా రాలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో వరద విలయతాండవం పరిస్థితులు కూడా జాతీయస్థాయిలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌పైనే పడిందని చెప్పాలి. ప్రస్తుతం మార్కెకు కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న బెల్లం మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్‌ మేరకు బయటకు తీస్తారు. అయినప్పటికీ బెల్లం ధరలు మాత్రం పతనావస్థలోనే ఉన్నాయి. కొత్తబెల్లం ఉత్పత్తి కావాలంటే దసరా వరకు వేచి ఉండాల్సిందే.  

కాగా 15 కేజీల బెల్లం దిమ్మ స్థానంలో కేవలం 5 కేజీలు, 10 కేజీల బెల్లందిమ్మలకే ఉత్తరాదిలో డిమాండ్‌ పెరిగింది. ఇలా అన్‌సీజన్, ముసురు వాతావరణం, బెల్లంసైజు వంటి సమస్యలతో అనకాపల్లి బెల్లంమార్కెట్‌కు డీలా పడింది. బెల్లం రైతులు, అటు వర్తకులు అన్‌సీజన్‌ విషయంలో ఎలా ఉన్నా మార్కెట్‌పై ఆధారపడిన కొలగార్లు, కళాసీలు, కార్మికులు, వాహనదారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ( రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top