దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా కేసు పెట్టవచ్చు!

Alla Rama Krishna Reddy Comments On Chandrababu Reveals Amaravati Land Pooling - Sakshi

విజయవాడ: అమరావతిలో దళితుల భూములను చంద్రబాబు అక్రమంగా కాజేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రైతులకు మాయమాటలు చెప్పి, తక్కువ ధరకే వారి భూములను సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సీఐడీ అధికారుల ఎదుట హజరైన ఆళ్ల తన దగ్గరున్న భూకుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను అందించారు. ఈ భూలావాదేవీలకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇవ్వాల్సిన జీవోలను మున్సిపపల్‌ శాఖ ద్వారా అక్రమంగా పొందారని అన్నారు. ఒక్క మంగళగిరి నియోజక వర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేశారని  తెలిపారు.

తాడికొండతో కలుపుకుంటే మొత్తంగా  4 వేల ఎకరాల భూమిని లాక్కున్నారని పేర్కొన్నారు. దీంతో రాజధానికి రైతులు తన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే, దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా కేసు పెట్టవచ్చని చెప్పారు. దీనికి దళితుడే అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు తప్పుచేయకపోతే సీఐడీ అధికారుల ఎదుట హజరై విచారణను ఎదుర్కొవాలని సవాల్‌ విసిరారు.

చదవండి: ఏపీలో కొలువుదీరిన కొత్త పాలక మండళ్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top