అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆదివారంతో జిల్లా పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో అన్ని వార్డులు, డివిజన్లకు సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
ఎక్కడెక్కడ ఎంతమంది అంటే..
● చివరిరోజైన ఆదివారం అనంతపురం మేయర్ స్థానంతో పాటు 62 కార్పొరేటర్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మేయర్ స్థానానికి 29 నామినేషన్లు, కార్పొరేటర్ స్థానాల కోసం 440 నామినేషన్లను అధికారులు స్వీకరించారు.
● తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ స్థానానికి 10, కౌన్సిలర్ స్థానాలకు 206 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
● కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ స్థానానికి 11, కౌన్సిలర్ స్థానాలకు 137 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
● రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ స్థానానికి 16, కౌన్సిలర్ స్థానాలకు 277 మంది నామినేషన్లు వేశారు.
● గుత్తి మున్సిపల్ చైర్మన్ స్థానానికి 9, కౌన్సిలర్ స్థానాలకు 73 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
● గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ స్థానానికి 14, కౌన్సిలర్ స్థానాలకు 409 మంది నామినేషన్లు వేశారు.
మునిసిపల్ ఎన్నికల్లో
నామినేషన్ల ఘట్టం పూర్తి


