మూడేళ్లలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

అనంతపురం అగ్రికల్చర్‌: మూడేళ్లలో అంతర్జాతీయ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌–రాయలసీమ రైజింగ్‌’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆక్టోబర్‌ 2వ తేదీన మదనపల్లెలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం ఈ 10 జిల్లాల వారీగా ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ మూడు ప్రధాన శాఖలతో పాటు అనుబంధ శాఖలను భాగస్వామ్యం చేసి గ్లోబల్‌హబ్‌గా మార్చనున్నారన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 32 మండలాలు, 338 రైతు సేవా కేంద్రాలను 41 క్లస్టర్లుగా విభజించి మూడేళ్ల ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఉద్యానశాఖ ద్వారా రూ.2,252.31 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రెడీ చేశామన్నారు.

విస్తృత అవగాహన

ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి శనివారం నుంచి అక్టోబర్‌ 5 వరకు జిల్లా వ్యాప్తంగా అటు రైతులు, ఇటు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ద్వారా 10 జిల్లాల రూపురేఖలు, రైతుల స్థితిగతుల్లో ఎలా మార్పు రానుందనే ఆంఽశం గురించి 60 నుంచి 90 సెకన్ల నిడివి కలిగిన కంటెంట్‌ క్రియేట్‌ చేసి రీల్స్‌, వీడియోలు సోషల్‌ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, లింక్డ్‌ ఇన్‌ తదితర వాటిలో పోస్టు చేసి ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ అధికారిక ఖాతా (ఏపీ ఆఫిషియల్‌ న్యూస్‌)కు ఈనెల 30న 12 గంటల్లోపు ట్యాగ్‌ చేస్తే ... అందులో ఉత్తమమైన ఐదింటిని ఎంపిక చేసి మదనపల్లిలో అక్టోబర్‌ 2న నిర్వహించే కార్యక్రమంలో సత్కారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ ఎన్‌.సాలురెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ జి.చంద్రశేఖర్‌, ఉద్యాన శాఖ డీడీ బీసీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement