అనూష..
అంతర్జాతీయ ఖ్యాతి
నార్పల మండలం బండ్లపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అమ్మాయి... తన తల్లిదండ్రులే కాదు.. యావత్ జిల్లా వాసులు గర్వపడేలా క్రికెట్‌లో రాణిస్తోంది. గ్రామీణ వాతావరణంలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి.. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పరిమిత సదుపాయాలను అధిగమిస్తూ భారత మహిళల క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టింది. తనదైన శైలిలో క్రికెట్‌లో రాణిస్తూ ప్రస్తుతం మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ‘రాయలసీమ ఎక్స్‌ఈఎన్ స్టార్స్’జట్టును ఫైనల్స్‌కు చేర్చింది.
కుమార్తె కలకు అడ్డంకి కాలేదు
వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునే మేము ఏనాడూ మా కుమార్తెను ఆడపిల్లగా చూడలేదు. క్రికెట్ ఆడతానంటే అమ్మాయి భవిష్యత్తు కోసం కొద్దోగొప్పో దాచుకున్న సొమ్ము తీసి ఇచ్చేవాళ్లం. ఆర్డీటీ వారు ఎంతో సహకరించారు. అనూష భారత జట్టుకు ఎంపికై న రోజున కూడా మేము మా జీవనాధారమైన వ్యవసాయ పనులకు వెళ్లాం. మా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కుమార్తె క్రికెట్ కలకు అడ్డంకిగా మారకూడదనే అనుకున్నాం.
– బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి (అనూష తల్లిదండ్రులు)


