కూతుళ్లను ఉన్నతస్థానంలో చూడాలని.. | - | Sakshi
Sakshi News home page

కూతుళ్లను ఉన్నతస్థానంలో చూడాలని..

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

నార్పల మండలం బొందలవాడకు చెందిన రామకృష్ణ, ఆదెమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రామకృష్ణ తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినా పిల్లల చదువుకు లోటు రానివ్వలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కుమార్తెలు కూడా చదువులో రాణిస్తూ ముందుకు సాగారు. అలా బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన పెద్దమ్మాయి స్వరూపరాణి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రెండో కూతురు శృతి కేంద్ర ప్రభుత్వ సంస్థ పరిధిలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరంలో ఎంఎల్‌హెచ్‌పీ/ సీహెచ్‌ఓ ఉద్యోగం సాధించింది. మూడో కూతురు సోనీ డీ ఫార్మసీ చదువుతోంది. మా విజయాలకు కారణమైన తల్లిదండ్రులను ఏ కష్టమూ లేకుండా చూసుకుంటామని ముగ్గురు అమ్మాయిలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement