‘కాగ్నిజెంట్‌’లో సంబరాలు | - | Sakshi
Sakshi News home page

‘కాగ్నిజెంట్‌’లో సంబరాలు

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రెండు రోజుల క్రితం విడుదలైన జేఈఈ మెయిన్స్‌–2026 ఫలితాలు, ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో అనంతపురంలోని కాగ్నిజెంట్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. దీంతో బుధవారం ఆ కళాశాలలో సంబరాలు చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సంస్థ సీఈఓ ఎస్వీ రత్నాకర్‌ ప్రసాద్‌, డైరెక్టర్లు ఆలూరు సాంబశివారెడ్డి, జె.సాల్మన్‌రాజు, కె.నరేంద్ర రెడ్డి, కళాశాల అధ్యాపకులు హాజరయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆలూరు సాంబశివారెడ్డి సత్కరించారు. జేఈఈ మెయిన్స్‌లో జి.సుశాల్‌ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 168 సాధించగా, ఆర్‌ జస్వంత్‌ కుమార్‌ 262, ఎస్‌.తరుణ్‌ 1,088, ఎం. సాయిసహస్ర 1,479, ఎ.ప్రణవి 3,213, వి. మణిదీపిక 4,444, యు.నవీన్‌ 4,883, బి.జయవర్ధన్‌ 5,957, వీఎన్‌ శోభన్‌ 10,730, ఎ.సాయిశృతి 13,874, ఎన్‌.సాయి చరణ్‌ 14,414, బి విశ్వంత్‌రెడ్డి 15,127, పి.హాసిని 15,123, కె.తేజజ్యోతి 16,756 ర్యాంకులు సాధించారు. 90 పర్సంటైల్‌కు పైగా 29 మంది విద్యార్థులు సాధించారు. మొత్తం 33 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని రత్నాకర్‌ ప్రసాద్‌ తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లోనూ 988 మార్కులతో ఎన్‌. విశిష్ట టాపర్‌గా నిలిచిందన్నారు. అలాగే 986 మార్కులతో ఎం రూపేష్‌, జి గ్రీష్మ, ఎం చేతన, ఎ.ప్రణవి మెరిసారన్నారు. 980 మార్కులకు పైగా 47 మంది, 950కు పైగా 91 మంది, 900కు పైగా 146 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జూనియర్‌ ఎంపీసీ విభాగంలో పి చైత్ర, కె.సాయి వర్షిత్‌, సి.పూజ, వి.రిషిత, డి.ప్రగతి చౌదరి 465 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారన్నారు. డి.జైలీల, కె.భవ్య తన్విస్‌ చరణ్‌, ఎం.జస్వంతి, డి.రజితేశ్వరి, ఎం.యోగేష్‌ రావు, జె.కెన్నిత్‌ సాల్మన్‌ 464 మార్కులు సాధించారన్నారు. 460 మార్కులకు పైగా 47 మంది, 450కు పైగా 100 మంది, 400కు పైగా 242 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు వివరించారు. బైపీసీ విభాగంలో జి.పూజశ్రీ 448 మార్కులతో టాపర్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు. కె.సాకేత్‌ నాయర్‌, వి.నిఖిలశ్రీ 447 మార్కులతో రెండో స్థానం దక్కించుకున్నారన్నారు. 440కు పైగా 11 మంది, 420కు పైగా 30 మంది, 390కు పైగా మార్కులతో 44 మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కాగ్నిజెంట్‌ను ఆదర్శవంతమైన జూనియర్‌ కళాశాలగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement