జేఈఈ మెయిన్స్‌లో సత్తా | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో సత్తా

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: దేశంలో పేరు మోసిన ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, బీఈ కోర్సుల ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన రెండో విడత జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తాచాటి ఆలిండియా ర్యాంకులను కై వసం చేసుకున్నారు. జనరల్‌ ర్యాంకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. సెషన్‌–1 ఫలితాలు జనవరిలో విడుదల కాగా, తాజాగా సోమవారం రాత్రి సెషన్‌–2 ఫలితాలు విడుదలయ్యాయి. రెండు సెషన్లలో ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. జి.సుశాల్‌ 168, ఆర్‌.భార్గవి 232, ఆర్‌.జస్వంత్‌కుమార్‌ 262, గురుగుంట్ల వైష్ణవి 395, అఖిల 976, గుండే శివమణినాయుడు 1,059, ఎస్‌.తరుణ్‌ 1,088, ఎం.తన్విక 1,240, ఎం.సాయిసహస్ర 1,479, ఓతూరి అబుసాజిద్‌ 1,809, డి.ఫయాజ్‌ అహమ్మద్‌ 2,547, ఎ.ప్రణవి 3,213, ప్రతాప్‌ రెడ్డి 3,925, అన్వేష్‌ 4,005, జశ్వంత్‌నాయక్‌ 4,024, కిరణ్‌ కౌషిక్‌ 4,278, వి.మణిదీపిక 4,444, మహర్ష 4,718, యు.నవీన్‌ 4,883, బి.శివదీప్‌ 5,045, బి.జయవర్దన్‌ 5,957, ఎస్‌.హాజీవలి 6,943వ ర్యాంకు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement