గడ్డివాములకు నిప్పు పెడుతున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గడ్డివాములకు నిప్పు పెడుతున్న వ్యక్తి అరెస్ట్‌

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

పెద్దవడుగూరు: మండల కేంద్రం చుట్టుపక్కల వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. సోమవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వారు వెల్లడించారు. గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన తపెల పెద్దరంగడు అలియాస్‌ సుధాకర్‌ కొన్ని రోజులుగా పెద్దవడుగూరులో తిరుగుతూ గడ్డివాములకు నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందసాగాడు. ఈ నెల 13న రైతు గొల్ల గంగన్న గడ్డివాములు, 14న జడ్‌.వీరారెడ్డికి చెందిన గడ్డివాములు, 15న జెడ్‌.హనుమంతరెడ్డి గడ్డివాములు, 18న మొళకతాళ్లలో, 19న పెద్దవడుగూరులోని వట్టెం విజయబాస్కర్‌రెడ్డికి చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టాడు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిఘా పటిష్టం చేవారు. ఈ క్రమంలో 19వ తేదీన చోటు చేసుకున్న సంఘటనా ప్రదేశంలోని సీపీ కెమెరాల్లో నిక్షిప్తమైన పుటేజీల ఆధారంగా సోమవారం పెద్ద రంగడుని అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement