రూ. 50వేలు తిరిగి ఇవ్వనందుకు తన భర్త హుస్సేన్‌బాషాను పది రోజుల క్రితం కిడ్నాప్ చేసి, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని సాకే కామాక్షి అనే మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. అనంతపురంలోని భారత్ వాటర్‌ప్లాంట్‌లో తన భర్త హుస్సేన్‌బాషా పని చేసేవాడని గుర్తు చేశారు. ఈ క్రమంలో యజమాని వద్ద అప్పు చేశాడని, తిరిగి ఇవ్వకపోవడంతో వారు బందీగా చేసుకున్నారని వివరించారు. ఆరేళ్ల్లుగా కనీస జీతం కూడా ఇవ్వకుండా పనులు చేయించుకున్నారన్నారని, ఇప్పుడు తన భర్తను వదిలి పెట్టకపోవడంతో ఇంట్లో జీవనం దుర్భరంగా మారిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి, రోజూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎలాగైనా తన భర్తను విడిపించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.


