బీసీలపై ప్రభుత్వానికి వివక్ష | - | Sakshi
Sakshi News home page

బీసీలపై ప్రభుత్వానికి వివక్ష

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

అనంతపురం: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని, ఎలాంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు దక్కకుండా చంద్రబాబు ప్రభుత్వం వివక్షకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌గౌడ్‌ విమర్శించారు. ఈ నెల 26న అనంతపురంలో తలపెట్టిన ‘బీసీ గళం’ కార్యక్రమం విజయవంతం చేయడానికి గల కార్యాచరణపై సోమవారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 26న జరగబోయే బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారిత దిశగా గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాటలు వేశారని గుర్తు చేశారు. బీసీలను చంద్రబాబు బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌గా భావిస్తే.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా వైఎస్‌ జగన్‌ మార్చారని ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం, విద్యాదీవెన, విద్యా కానుక, పొదుపు మహిళలకు ఆసరా, అక్క చెల్లెమ్మలకు చేయూత లాంటి పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేసి అన్ని విధాలుగా అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న (న్యాయవాది), రాధాకృష్ణ, బీసీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, బీసీ సెల్‌ నగర కార్యదర్శి నరేష్‌, శ్రీనివాసులు, రిలాక్స్‌ నాగరాజు, శేఖర్‌ బాబు, రాజశేఖర్‌, నవీన్‌, లక్ష్మణ్‌, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, రాజేష్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, కై లాష్‌, చిన్న రాయుడు, ఎం. కిరణ్‌, దస్తా వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement