అనంతపురం సెంట్రల్: మగ దిక్కు లేక హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళ కుటుంబంపై ఓ తాగుబోతు వేధింపులకు పాల్పడ్డాడు. హోటల్లో ఉంటున్న 17 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెను బలవంతం చేయడానికి యత్నించాడు. ఈ ఘటన సోమవారం అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో ఉన్న రుద్రవైన్స్ షాపు వద్ద చోటు చేసుకుంది. ‘నేను రౌడీషీటర్‌ని.. ఒకడ్ని చంపినా... నన్ను అడ్డుకునే వారు ఈ నగరంలోనే లేరు.. నీ బిడ్డను కిడ్నాప్ చేస్తా.. మీకు ఎవరు అడ్డు వస్తారో చూస్తా ’. అంటూ మద్యం మత్తులో రెచ్చిపోతూ బట్టలు విప్పి ఒంటరి మహిళ, ఆమె కుమార్తెతో పట్టపగలే అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు వెంటనే దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, నాల్గో పట్టణ పోలీసులకు అప్పగించారు. దుండగుడు ఎవరన్నది పోలీసులు విచారిస్తున్నారు.
దేహశుద్ధి చేసి పోలీసులకు
అప్పగించిన స్థానికులు


