మంత్రి పయ్యావుల అనుచరుడి దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

మంత్రి పయ్యావుల అనుచరుడి దౌర్జన్యం

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

మూడు తులాల బంగారు నగలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌, మంత్రి పయ్యావుల కేశవ్‌ అనుచరుడు లక్కవరం శ్రీనివాసులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనంతపురానికి చెందిన సాయిలీల ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె తన వేదనను విలేకరులకు వెల్లడించారు. 2023 డిసెంబర్‌ నుంచి తనను వారు వేధిస్తున్నారని, ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఎస్పీని కలిసి విన్నవించుకున్నానని తెలిపారు. ఎస్పీని కలిసిన ప్రతిసారీ అనంతపురం రూరల్‌ పోలీసులకు సిఫారసు చేస్తున్నారని, అయినా తనకు న్యాయం చేకూరడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో లక్కవరం శ్రీనివాసులును రూరల్‌ పోలీసుస్టేషన్‌కు పోలీసులు పిలిపించి, పంచాయితీ చేశారని, ఆ సమయంలో నగలు తిరిగి ఇస్తానంటూ అంగీకరించాడని తెలిపారు. అయితే నేటికీ నగలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికై నా పోలీసులు తనకు న్యాయం చేయాలని ఎస్పీని కలిసి వేడుకున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement