నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

న్యూస్‌రీల్‌

అనంతపురం అర్బన్‌ కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. మార్పు చేసిన వేళలను ప్రజలు గమనించాలని సూచించారు. పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో భూసమస్యలపై అర్జీలను అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా సమర్పించవచ్చని తెలియజేశారు.

నేడు డయల్‌ యువర్‌

ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ..

అనంతపురం జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు 08554– 272943, 9154790350 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement