అనంతపురం సెంట్రల్: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో మహిళలను వేధిస్తున్న కీచకుడిపై విచారణకు కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక కమిటీని నియమించారు. మున్సిపాలిటీ, సచివాలయాల పరిధిలో పనిచేసే మహిళా ఉద్యోగులను కీలక అధికారి లైంగికంగా వేధించేవాడు. కాపురాలు కూల్చే స్థితికి తీసుకొచ్చేవాడు. పలుమార్లు గొడవలు జరిగినా ఆ అధికారి తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 15న ‘మున్సిపాలిటీలో కీచకుడు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులు ఇప్పటికే తాడిపత్రికి వెళ్లి ప్రాథమికంగా విచారణ చేపట్టారు. బాధితులు మరింత స్వేచ్ఛగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని కో–ఆపరేటివ్ కార్యాలయంలో తమ గోడును తెలియజేయవచ్చని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తెలిపారు.


