వినీలాకాశంలో విరబూసిన
సింధూర రేఖ
అల్లంత దూరాన ఉన్న కొండల మధ్య నుంచి శుక్రవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో సూరీడు అస్తమిస్తూ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాడు. ఆకాశంలో సింధూర వర్ణంలో ఆవిష్కృతమైన రేఖను చూసిన పలువురు తన్మయత్వం చెందారు. సూరీడు సిగలోని ఓ పాయ అలా గాలిలో ఎగురుతున్నట్లుగా పంచిన అనుభూతిని పలువురు తమ సెల్‌ఫోన్లలో భద్రపరుచుకున్నారు. ఈ అద్భుత దృశ్యం కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో చూపరులను ఆకట్టుకుంది. ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– కళ్యాణదుర్గం:


