అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండింటా జిల్లా రాష్ట్రంలో 15వ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి సంవత్సరంలో గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగినా.. ద్వితీయ సంవత్సరంలో తగ్గింది. బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 63 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 17వ స్థానంలో నిలవగా ఈసారి 73 శాతానికి పెరిగి 15వ స్థానాన్ని కై వసం చేసుకుంది మొత్తం 21,730 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 15,814 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 11,434 మంది బాలికలకు గాను 9,144 మంది 77.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. 10,296 మంది బాలురకు గాను 6,670 మంది 63.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపుల్లో ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలతో పోటీపడుతూ మార్కులు సాధించారు.
● జిల్లాలోని 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,667 మంది విద్యార్థులకు గాను 1,560 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1663 మంది బాలికలను గాను 911 మంది (54.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 1694 మంది బాలురకు గాను 649 మంది (38.31 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● రెండు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 703 మంది విద్యార్థులకు గాను 191 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 187 మంది బాలికలను గాను 91 మంది (48.66 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 516 మంది బాలురకు గాను 100 మంది (19.37) శాతం ఉత్తీర్ణత సాధించారు.
● 9 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 665 మంది విద్యార్థులకు గాను 567 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 489 మంది బాలికలను గాను 417 మంది (85.27 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 176 మంది బాలురకు గాను 150 మంది (85.22 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 15 మోడల్ స్కూళ్లల్లో 968 మంది విద్యార్థులకు గాను 598 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 739 మంది బాలికలను గాను 490 మంది (66.30 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 229 మంది బాలురకు గాను 108 మంది (47.16 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 9 కేజీబీవీ స్కూళ్లల్లో 788 మంది బాలికలను గాను 628 మంది (79.69 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 65 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 15,886 మంది విద్యార్థులకు గాను 12,270 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 7,958 మంది బాలికలను గాను 6,607 మంది (83.02 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 7,928 మంది బాలురకు గాను 5,663 మంది (71.43 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు
రెండుస్థానాలు దిగువకు..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో గతేడాదికంటే ఈసారి రెండుస్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 13వ స్థానంలో ఉండగా ఈసారి 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది కంటే ఈసారి నాలుగు శాతం తగ్గింది. మొత్తం 20,320 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76 శాతం అంటే 15,530 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 10,790 మంది బాలికలను గాను 7,954 మంది (72.11 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 9530 మంది బాలురకు గాను 6,664 మంది (68.49 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,057 మంది విద్యార్థులకు గాను 1,560 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,490 మంది బాలికలను గాను 1,008 మంది (67.65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 1567 మంది బాలురకు గాను 858 మంది (54.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● రెండు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 538 మంది విద్యార్థులకు గాను 191 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 137 మంది బాలికలను గాను 76 మంది (55.47 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 401 మంది బాలురకు గాను 115 మంది 28.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● 9 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 561 మంది విద్యార్థులకు గాను 544 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 460 మంది బాలికలను గాను 407 మంది (88.48 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 154 మంది బాలురకు గాను 137 మంది (88.96 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 15 మోడల్ స్కూళ్లల్లో 979 మంది విద్యార్థులకు గాను 685 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 717 మంది బాలికలను గాను 525 మంది (73.22 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 262 మంది బాలురకు గాను 160 మంది (61.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 9 కేజీబీవీ స్కూళ్లల్లో 710 మంది బాలికలను గాను 564 మంది (79.44 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● 65 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 14,862 మంది విద్యార్థులకు గాను 11,668 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 7,516 మంది బాలికలను గాను 6,274 మంది (83.48 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 7,346 మంది బాలురకు గాను 5,394 మంది (73.43 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోండి
ఈ నెల 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీటోటలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీటోటలింగ్ కోసం రూ. 260 చెల్లించాలని ఆర్‌ఐఓ వెంటకరమణనాయక్ తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు 15వ స్థానం
ఫస్టియర్ 73, సెకండియర్ 76 శాతం ఉత్తీర్ణత
మెరిసిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు


