అనంతపురం ఎడ్యుకేషన్: ఈ రోజుల్లో చదువు అంటే చాలా మందికి కార్పొరేట్ కాలేజీలు, భారీ ఫీజులు, ప్రత్యేక కోచింగ్ సెంటర్లు గుర్తుకొస్తాయి. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అన్ని సౌకర్యాలతో ఉన్న కళాశాలల్లో చదువుకుని మంచి మార్కులు సాధించడం గొప్పకాదు. కూలినాలి చేసుకునే కుటుంబాలు, పూటగడవని కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ కళాశాలలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటూ మంచి మార్కులు సాధించడం గొప్ప. ఇందుకు నిదర్శనమే బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలు. ప్రభుత్వ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. సౌకర్యాలు లేకపోయినా, అత్యాధునిక ల్యాబ్స్ లేకపోయినా, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేక ట్యూషన్లకు వెళ్లకుండా సంక్షోభాల మధ్య చదువుకుని కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రమూ తీసిపోని విధంగా మార్కులు సాధించి ప్రశంసలందుకుంటున్నారు. వీరిలో కొందరి తల్లిదండ్రులు కూలీలు, మరికొందరు రైతులు ఉన్నారు. ఇంకొందరు విద్యార్థులు అనాథలు ఉన్నారు. వీరికి చదువు ప్రాధాన్యత గురించి చెప్పే వారు కూడా లేరు. అయినా ఆ పిల్లల్లో ఉన్న సంకల్పమే వారి గురువు అయింది. వారి కుటుంబ కష్టాలే వారికి పాఠాలు నేర్పాయి. ఆర్థిక ఇబ్బందుల్లోనూ చదువుపైనే దృష్టి సారించారు. ఫలితంగా విజయాన్ని అందుకున్నారు. ‘ఎంత కష్టమైనా, చదువుతో జీవితాన్ని మార్చుకోవచ్చు’ అని నిరూపించారు.
భారతి, డి.హీరేహాల్, 493 (ఎంపీహెచ్‌డబ్ల్యూ)
ఎస్.తస్లీం,
488 (ఐఎంఎల్‌టీ)
షేక్ సానియా,
491 (సీఎస్‌ఈ)
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు
సౌకర్యాలు లేకపోయినా మెరుగైన మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు


