కొనే ముందు పరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

కొనే ముందు పరిశీలించాలి

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

మామిడి పండ్లను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఒకసారి పరిశీలించాలి. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువకాలం నిల్వ ఉండడమే కాక తియ్యటి వాసనతో ఉంటాయి. కృత్రిమంగా మాగిన మామిడి పండ్లలో పై పొర ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు కనిపిస్తాయి. అలాగే మామిడి పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాల పాటు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడిలేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది.

– మహేష్‌, ఉద్యాన అధికారి, హిందూపురం

Advertisement
 
Advertisement
Advertisement