వైభవం.. గావుల మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. గావుల మహోత్సవం

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

భక్తులతో కిటకిటలాడిన పోతలయ్యస్వామి ఆలయ ప్రాంగణం

కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో మంగళవారం పోతలయ్యస్వామికి గావుల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పోతలయ్యస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలు, యువకులు జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం పోతురాజులు ఉరుముల శబ్ధాలకు నృత్యాలు చేసుకొంటూ వచ్చి ఆలయం ముందు మేకపోతు పిల్లలను బలి ఇచ్చి గావుల మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ దృశాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement