రెడ్‌బుక్‌తో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌తో అరాచక పాలన

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

అనంతపురం: దేశంలోని అన్ని రాష్ట్రాలూ అంబేడ్కర్‌ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగం రూపొందించిన అంబేడ్కర్‌ తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత మంత్రి వర్గంలోనూ, నామినేటెడ్‌ పదవుల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని ప్రశంసించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్‌, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మేయర్‌ వసీం, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ గౌడ్‌, వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పూజారి రాజశేఖర్‌ యాదవ్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, ఎద్దుల అమరనాథరెడ్డి, గోగుల రాధాకృష్ణ, చంద్రశేఖర్‌ యాదవ్‌, కై లాష్‌, జిల్లా అధికార ప్రతినిధులు సీపీ వీరన్న, చింతకుంట మధు, నాటక అకాడమీ మాజీ చైర్‌పర్సన్‌ రాగే హరిత, ఆర్టీసీ జోనల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ మంజుల, రాధాయాదవ్‌, సాకే చంద్రలేఖ, అంజలి, శోభారాణి, ముక్తియార్‌, అనిల్‌కుమార్‌ గౌడ్‌, క్రిస్టియన్‌ మైనార్టీ నేత చిలకల థామస్‌, పసలూరు ఓబులేసు, పార్టీ నేతలు భారతి, ప్రియాంకరెడ్డి, భారతిరెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ శంకరయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement