ఓ వైపు ఎండలు.. మరోవైపు దాహం ఆ వానరాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. అప్పుడే ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని హోటల్ వైపు వెళ్లింది. అక్కడ జనం హడావుడి కనిపించింది. గొంతెండిపోతుంటే తాళలేక హోటల్‌లోకి వెళ్లి అక్కడున్న నీళ్ల బాటిల్‌ను ఎత్తుకుని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్టు కిందకు చేరుకుంది. అక్కడ బాటిల్ మూత తీసి గుటగుటా తాగుతుండగా.. పక్కనే ఉన్న మరికొన్ని వానరాలు వచ్చాయి. వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బాటిల్‌లోని నీళ్లన్నీ ఆ ఒక్క వానరమే తాగేసి దాహం తీర్చుకుంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – ఉరవకొండ:


