ప్రాణాలు బలిగొన్న ఫిట్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు బలిగొన్న ఫిట్స్‌

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

తాడిపత్రి రూరల్‌: మూర్చ వ్యాధి ఒకరి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం రాయలచెరువుకు చెందిన శివశంకర్‌ కుమారుడు మోహన్‌కుమార్‌ (25) తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబ పోషణ భారాన్ని ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన స్నేహితుడు మధుతో కలసి పనుల కోసమని ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి బయలుదేరాడు. తేళ్లమిట్టపల్లి వద్దకు చేరుకోగానే బైక్‌ నడుపుతున్న మోహన్‌కుమార్‌కు ఫిట్స్‌ వచ్చాయి. దీంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మోహన్‌కుమార్‌, మధును అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే తాడిపత్రిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మోహన్‌కుమార్‌ పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వల్పంగా గాయపడిన మధు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement