●వైభవంగా నెట్టికంటుడి ప్రతిష్టాపన
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం నూతనంగా నిర్మించిన బాలాలయంలో నెట్టికంటుడి ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గర్భాలయ నిర్మాణం నేపథ్యంలో మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు.. ఆలయ ధ్వజస్తంభం వద్ద బాలాలయాన్ని నిర్మించి ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్టింపజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారుల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో బాలాలయంలో స్వామివారిని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ట చేశారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, దాత పెరవలి పారా విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
●వైభవంగా నెట్టికంటుడి ప్రతిష్టాపన


