నేరస్తులెవ్వరూ తప్పించుకోరాదు
అనంతపురం సెంట్రల్: సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచి నేరస్తులెవ్వరూ తప్పించుకోకుండా శిక్ష పడేలా చేయాలని కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ విభాగం సిబ్బందితో శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ సమావేశమై మాట్లాడారు. ఈ నెల 14న జరిగే లోక్‌అదాలత్‌పై పలు సూచనలు చేశారు. కేసుల విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు విజయభాస్కర్‌గౌడ్, వలీబాషా పాల్గొన్నారు.


